| Daily భారత్
Logo




నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు!

News

Posted on 2025-12-15 11:59:20

Share: Share


నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు!

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌ మహానగరం లో న్యూ ఇయిర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 వ తేదీ అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు అమలయ్యేలా త్రీ స్టార్ హోటల్స్, క్లబ్బులు బార్ కం రెస్టారెంట్లు, నిర్వహణపై మార్గదర్శకాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ సీ సజ్జనార్, తాజాగా వెల్లడించారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి, అశ్లీల నృత్యాలు నిషేధించినట్లు తెలిపారు. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటిం చారు..పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరించినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాగి వాహనం నడిపితే జరిమానా, తో పాటు..జైలు శిక్ష విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్‌ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు నమోదు చేస్తామని అన్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌పై వెహికల్‌ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు అన్నారు. నూతన సంవత్సన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. పార్టీల కోసం యువత వివిధ ప్లాన్లు వేసుకుంటున్నారు. కాగా.. ఈ వేడుకలకు సంబంధించి పలు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకలను రాత్రి 12:30 గంటల్లోపుముగించాలి. ఈవెంట్ నిర్వాహకులు 15 రోజుల ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలి. ఈవెంట్స్‌లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈవెంట్స్‌లో అశ్లీల నృత్యా లకు అనుమతి లేదు. 45 డెసిబుల్స్ శబ్ధం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దు. కెపాసిటికి మించి పాసులు ఇవ్వొద్దు. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు. లిక్కర్ ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు అని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు.కొంత సంతోషం.. మరికొంత దుఃఖం వంటి జ్ఞాపకాలు మిగిల్చి2025 మరికొన్ని రోజుల్లోనే వెళ్లిపోనుంది. నయా జోష్‌తో న్యూ ఇయిర్‌ 2026 ఆవిష్కృతం కానుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి వయో భేదం లేకుండా ప్రజలు సిద్ధమ  వుతున్నారు. మరోవైపు న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఆంక్షలు ఉండటంతో యు వత కుటుంబసభ్యులతో కలిసి ఇళ్లలోనే వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కొన్ని కుటుంబాలు కలిసి కొత్త వేడుకలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. మరికొంతమంది యువకులు కొత్త సంవత్సరం వేడుకలకు బెంగుళూరు, గోవా, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు.

న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఫోకస్

హైదరాబాద్‌‌లోని శివారు ప్రాంతాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతలపై పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. యువకులు మద్యం తాగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉండటంతో ఆంక్షలు విధించారు. డిసెంబర్‌ 31 రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.

పోలీసుల నిబంధనలు

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేయనున్నారు.మైనర్‌లకు బైక్‌లు ఇవ్వడంతో ప్రమాదాలు జరగవచ్చు. తల్లిదండ్రులు మైనర్‌లకు బైక్‌లు ఇవ్వవద్దు. పోలీసులకు పట్టుబడితే కేసులు నమోదు చేస్తారు.అతి వేగంగా వాహనాలు నడిపితే జరిమానాతోపాటు చర్యలు ఉంటాయి.భారీ శబ్ధాలు చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడపొద్దు.గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీ వంటివి చేపట్టవద్దు.రోడ్లపై బాణాసంచా కాల్చవద్దు. మైక్‌లు ఎక్కువ సౌండ్‌ పెట్టి ఇబ్బంది పెట్టవద్దు.డీజేలపై నిషేధం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వాడితే సీజ్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.రాత్రి వేళల్లో ట్రిఫుల్‌ రైడింగ్‌, సైలెన్సర్‌లను తీసివేసి వాహనాలను నడుపుతూ శబ్ధకాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్‌ చేస్తారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధం. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే పోలీస్‌ చర్యలు తప్పవు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >