Posted on 2025-12-15 14:18:31
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై కాంగ్రెస్ నాయకులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం హుజూర్ నగర్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుందన్నారు. గతంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్దతిలో కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా జరిగాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవాలని ప్రజలను అభ్యర్థించారు
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >