| Daily భారత్
Logo




ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది

News

Posted on 2025-12-21 18:33:48

Share: Share


ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది

వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు

ఆహార అలవాట్లు, అధిక ఒత్తిడి వలనే ఆరోగ్య సమస్యలు

షుగర్ పేషెంట్లు తరచూ గుండె, కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి 

నిరంతర వైద్య సేవలో వైరా బోడేపూడి వైద్య శిబిరం

126 నెలలుగా బోడేపూడి వైద్య శిబిరం నిర్వహణ

ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి, బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు.

డైలీ భారత్ న్యూస్, వైరా:ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ప్రముఖ ప్రజా వైద్యులు చీకటి భారవి, బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల మూడవ ఆదివారం నిర్వహించే బోడేపూడి వైద్య శిబిరాన్ని 126వ నెల విజయవంతంగా నిర్వహించారు. గత 10 సంవత్సరాల క్రితం నుంచి వైద్య  శిబిరం ద్వారా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది పేద, మద్యతరగతి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. నెల రోజులకు సరిపడా మందులను కేవలం100 రూపాయలకే అందిస్తున్నారు. వైద్య శిబిరం పై పూర్తి నమ్మకంతో వేలాది మంది ప్రజలు సంవత్సరాల తరబడి ఉచితంగా వైద్య  సేవలు పొందుతున్నారు. వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడంలో డాక్టర్లు, వాలంటీర్ల కృషి అభినందనీయం.  ఆదివారం ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి,  డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు, డాక్టర్ జట్ల రంగారావు గుర్రం రమణారెడ్డి బృందం ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.  ఈ సందర్భంగా డాక్టర్ చీకటి భారవి, బొంతు రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక  విధానాలు వలన ప్రజలకు ఉచితంగా వైద్యం లభించడం లేదని అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వైద్య రంగాన్ని, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. నేడు దేశంలో లక్షలాదిమంది పేద ప్రజలు సరైన వైద్యం అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వ వైద్య రంగానికి అధికంగా నిధులు కేటాయించాలని కోరారు.‌ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని, ఆధునిక ఆహార అలవాట్లు,  నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఆదునిక కార్పొరేట్  కాలంలో మనిషి జీవన ప్రమాణ కాలం తగ్గుతుందని అన్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయాలని, సరైన పౌష్టికాహారం తీసుకోవాలని,  షుగర్, బిపి మందులు దీర్ఘకాలంగా వాడే వారు గుండె, కిడ్నీ, న్యూరో సంబంధించిన పరీక్షలు తరచూ చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  బోడేపూడి  వైద్య  శిబిరం  బాధ్యులు సుంకర సుధాకర్,  వాలంటీర్లు గుడిమెట్ల మోహన్ రావు, బొంతు సమత, అనుమోలు రామారావు, మాదినేని రజిని, మల్లెంపాటి ప్రసాదరావు, కంభంపాటి సత్యనారాయణ, ఐలూరి శ్రీనివాసరేడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >
Image 1

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

Posted On 2026-06-23 13:31:34

Readmore >
Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >