| Daily భారత్
Logo




కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం అందాలి

News

Posted on 2025-12-21 17:35:17

Share: Share


కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం అందాలి

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:న్యాయాన్ని కోరుకుంటూ కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం అందే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహన్ న్యాయవాదులను కోరారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు హాల్ నందు జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులు అనునిత్యం అధునాతన న్యాయ గ్రంథాలను, న్యాయ శాస్త్రాలను,ఉన్నత న్యాయస్థానాలు వెలువరించే తీర్పులను నిరంతరం చదువుతూ న్యాయ విజ్ఞానం పెంపొందించు కోవాలని సూచించారు. హుజూర్ నగర్ కోర్టులో తను కొద్ది కాలం పాటే పనిచేసినప్పటికీ న్యాయ వాదులు నాకు సహకరించిన తీరు ఈ ప్రాంత వాతావరణం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. తన విధి నిర్వహణలో ఏదైనా సందర్భంలో కఠినంగా వ్యవహరిస్తే అది వృత్తిపరమైన చర్యలో భాగమే కాని వ్యక్తిగతం కాదన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన బార్ అసోసియేషన్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా లు మాట్లాడుతూ తమకు ఉద్యోగ పరంగా ఏదైనా సందేహం ఏర్పడినప్పుడు అదనపు జిల్లా న్యాయమూర్తి చేత నివృత్తి చేసుకునే వారమని ఉద్యోగ పరంగా వారు మాకు అనేక రకాలుగా సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >
Image 1

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

Posted On 2026-06-23 13:31:34

Readmore >
Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >
Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >