| Daily భారత్
Logo




కర్ల రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్

News

Posted on 2025-12-21 17:34:15

Share: Share


కర్ల రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్

కర్ల రాజేష్ మృతిపై నోరు ఇప్పని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

డైలీ భారత్ న్యూస్, చిలుకూరు:ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు  చిలుకూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లేపంగు సూరిబాబు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ హుజూర్ నగర్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్  బచ్చలకూరి ప్రసాద్ మాదిగలు హాజరయ్యారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చిలుకూరు ఎస్ఐని కాపాడే ప్రయత్నం చేస్తున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

ప్రయత్నం మానాలని హితవు పలికారు. రాజేష్ పై చిత్రహింసలకు పాల్పడి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులందరి మీద హత్యా నేరం మోపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎమ్మార్పీఎస్  ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతిరాల నాగయ్య,మీసాల శరత్ బాబు, మంద వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ మండల అధ్యక్షులు గుండెపొంగు బాబు, పట్టణ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి సోమపంగు రవీంద్ర, ఉపాధ్యక్షులు మేళ్లచెరువు సురేష్, మెరుగ క్రాంతి, రేడపంగు రాజేష్, మెరిగ సాయి, సోమపంగు వెంకట్, కస్తాల నరసింహా రావు, గల్లా నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >
Image 1

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

Posted On 2026-06-23 13:31:34

Readmore >
Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >
Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >