Posted on 2025-12-21 15:33:02
డైలీ భారత్ న్యూస్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మోడర్న్ కబడ్డీ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మోడర్న్ కబడ్డీ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకే మధు, వార్డు మెంబర్ కార్తీక్, జంకే లావణ్య, మల్లేశం హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా మోడర్న్ కబడ్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్, కార్యవర్గ సభ్యులు విక్కుర్తి అంజయ్య, సందేల నరేష్, చిలుక ప్రభాకర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
జిల్లా స్థాయి సెలెక్షన్స్ సందర్భంగా హనుమాజీపేట గ్రామ సర్పంచ్ జంకే మధు అమ్మగారి జ్ఞాపకార్థంగా రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు రూ.10,000/- విలువ గల జెర్సీలను అందజేశారు.
ఈ జిల్లా స్థాయి సెలెక్షన్స్‌లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 26 నుండి ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి మోడర్న్ కబడ్డీ క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా ప్రధాన కార్యదర్శి తడకల సురేష్ తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >