Posted on 2025-12-21 20:23:54
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని స్థానిక ఆదర్శనగర్ లో గల నగర మేరు సంఘ భవనంలో మేరు కుల సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మూడు సంవత్సరాల కాల పరిమితి కొరకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటుపడుతున్న అధ్యక్ష అభ్యర్థులు మాట్లాడుతూ నగరంలోని 10 తర్పల పరిధిలో సుమారు 11 వందల కుటుంబాలు ఉన్నాయని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుటుంబానికి రెండు ఓట్ల చొప్పున ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. మేరు కులస్తుల ఐక్యత, అభివృద్ధి కొరకు పాటుపడడమే తమ లక్ష్యంగా భావిస్తున్నామని కత్తెర గుర్తు అధ్యక్ష అభ్యర్థి కొట్టూరు దేవదాస్ చెప్పారు. అలాగే రాజకీయంగా విద్య ఉద్యోగ రంగాల్లో తమ కులస్తులు ముందుండేలా చూస్తామని తెలియజేశారు. విద్యార్థులకు వారిలోని ప్రతిభా పాటవాలకు గుర్తించి ప్రోత్సహిస్తామని, నిరుపేద మేరు కులస్తుల అంత్యక్రియలకు 2000 రూపాయలు ఆర్థిక సహాయం తో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. అలాగే వివాహ యోగ్యులైన యువతీ యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక ను ఏర్పాటు చేస్తామని, నగరంలోని 10తర్పలలో భవనాల నిర్మాణానికి స్థల సేకరణ ఆర్థిక సహకారాన్ని అందిస్తామని తెలియజేశారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >