| Daily భారత్
Logo




మదనపల్లెలో పోలీసుల మెరుపు తనిఖీలు

News

Posted on 2025-12-22 13:27:14

Share: Share


మదనపల్లెలో పోలీసుల మెరుపు తనిఖీలు

61 వాహనాలు స్వాధీనం..

అనుమానితులపై నిఘా!

డైలీ భారత్ న్యూస్, అన్నమయ్య జిల్లా/మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మదనపల్లె పట్టణంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సోమవారం వేకువజామున పోలీసులు "కార్డన్ అండ్ సెర్చ్" నిర్వహించారు. మదనపల్లె డిఎస్పీ ఎస్. మహేంద్ర పర్యవేక్షణలో పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.

మదనపల్లె పట్టణ పరిధిలోని డక్నీ పేట, అగర్తలా వీధి, ఘోసియా వీధి, త్యాగరాయ వీధి మరియు బాడేమకాన్ ఏరియాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో 1వ పట్టణ సీఐ మహమ్మద్ రఫి, 2వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సరైన పత్రాలు లేని మరియు అనుమానాస్పదంగా ఉన్న 61 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాత నేరస్థులు, రౌడీ షీటర్లు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, వారిని క్షుణ్ణంగా విచారించారు.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, "ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చేసేందుకే ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాము. ముఖ్యంగా యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా ఉంచుతాము. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలి. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి" అని కోరారు

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >