| Daily భారత్
Logo




విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్ లపై తాగుబోతు దాడి..

News

Posted on 2025-12-22 15:44:30

Share: Share


విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీస్ లపై తాగుబోతు దాడి..

దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ట్రాఫిక్ సిఐ ఎస్ఐ పై నగరానికి చెందిన ఓ తాగుబోతు తన వాహనాన్ని ఆపారంటూ పోలీసులపై దాడికి దిగిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. వాహనాల తనిఖీలో భాగంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై పై దాడికి పాల్పడిన వ్యక్తిపై  త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్ ప్రాంతానికి చెందిన పిట్ల సాయిలు అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసులపై  విచక్షణారహితంగా దాడి జరిపారు. అనంతరం పోలీసులు అతనిని  అదుపులోకి తీసుకొని చితకబాది సంబంధిత మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు  మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో  పిట్ల సాయిలు పై కేసు నమోదు చేశారు. పోలీస్ విధులకు ఆటంకం కల్పిస్తూ, సిఐను తోసేసినట్లు కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. గత ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >