Posted on 2025-12-22 16:29:17
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రేమ, శాంతి, కరుణ, జాలి,దయ,మరొకరికి సహాయం చెయ్యడం, సోదరభావాన్ని పెంపొందించడం వల్ల యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ప్రార్ధించడం జరుగుతుందని జిల్లా సంక్షేమాధికారినితో పాటు ఫాస్టర్ రెవరెండ్ ఆరోన్, వక్తలు కొనియాడారు. క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని స్నేహ సొసైటీ దివ్యంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో వారు పేర్కొన్నారు... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యంగుల పాఠశాలల్లో క్రిస్మస్ పండుగ , ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకోని ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు...వేడుకల్లోభాగంగా పశువుల పాక, క్రిస్మస్ చెట్టు, అలంకరణ మరియు విద్యార్థిని,విద్యార్థులు యేసు ప్రభు,మరియమ్మ, గొల్లలు, గొర్ల కాపరులు లాంటి విభిన్న వేషధారణలో అందంగా ముస్తాబై ఏసుప్రభు జననం మరియు ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం సంబంధించి నాటక ప్రదర్శన ద్వారా తెలియపరిచారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మరియు సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఆరోన్ మరియు క్రిస్టియన్ సోదరులు హాజరై ప్రార్థన ద్వారా మరియు ఏసుక్రీస్తు జననం సంబంధించి క్లుప్తంగా వివరించారు...ప్రేమ, శాంతి, ఆనందాన్ని పరోపకారికి సహాయం చేయడం లాంటి విషయాలపై క్లుప్తంగా వివరించారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. దివ్యాంగులు అయినప్పటికీ యేసు ప్రభు వేషధారణతో పాటు నాటక ప్రదర్శనలు తిలకించిన అధికారులతో పాటు ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేశారు.
యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా, లోక రక్షకుడిగా జన్మించిన పవిత్ర దినంగా భావిస్తారని తెలిపారు. క్రిస్మస్ చెట్టు ఏర్పాటు, నక్షత్రాలు ఇళ్లను దీపాలతో అలంకరించడం లాంటివి ఎందుకు చేస్తారో క్లుప్తంగా వివరించారు..ఈ పండుగ ప్రేమ, శాంతి, సోదరభావాన్ని బోధిస్తుందన్నారు.
సెమీ క్రిస్మస్ వేడుకలను ముందుగా జరుపుకుంటారని తెలిపారు.. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను శాలువలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల,ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల,ప్రిన్సిపాల్ రాజేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, చర్చి పాస్టర్ రెవరెండ్ ఆరోన్ కమిటీ సభ్యులు తాటి వీరేశం గుప్తా, బాబా గౌడ్ , చర్చ్ కమిటీ కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రణయ్ కుమార్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు..
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >