| Daily భారత్
Logo




కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో అకాడమిక్ ఉత్సవాలు

News

Posted on 2025-12-22 17:29:57

Share: Share


కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో అకాడమిక్ ఉత్సవాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతదేశ గొప్ప గణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా “అకాడమిక్ మహోత్సవం” నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో భాగంగా విద్యార్థుల మేధస్సు, నైపుణ్యాలను పెంపొందించేందుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నోత్తరాల వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ విజయ లక్ష్మి, డైరెక్టర్ రజనీకాంత్, రామోజీరావు, రాజా  తేజస్విని హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ, కాకతీయ విద్యాసంస్థలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. జాతీయస్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే క్రీడలలో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, ప్రతి సంవత్సరం నిర్వహించే క్రీడోత్సవాలతో పాటు అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన సిలబస్ ఆధారంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

అత్యాధునిక ఐఐటి సిలబస్ ఆధారంగా గణిత ప్రతిభను పరీక్షించేందుకు మ్యాథ్స్ రత్న, భాషా నైపుణ్యాలను వెలికితీయడానికి స్పెలతాన్, విద్యార్థులు తమ ఆలోచనలను క్రమబద్ధంగా వ్యక్తపరచేందుకు టెడ్ కాకతీయ, అన్ని సబ్జెక్టుల్లో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు క్విజతాన్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.

నిజామాబాద్ పట్టణంలో తొలిసారిగా ఈ తరహా అకాడమిక్ మహోత్సవం నిర్వహించడం గర్వకారణమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సుభాష్ నగర్ క్యాంపస్ బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులను ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్న లెక్చరర్లు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల వివిధ ప్రిన్సిపాల్స్, నాన్ అకాడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు  పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >