| Daily భారత్
Logo




సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు

News

Posted on 2025-12-24 19:36:12

Share: Share


సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడు

రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం రెండు కళ్ళలాగా పనిచేస్తున్నారు..

ఇందుకు ఉదాహరణే గ్లోబల్ సమ్మిట్ లో లక్షల 70 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది

విలేకరుల సమావేశంలో పిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు కళ్ళలాగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీట్ లో 70 లక్షల వేల కోట్ల లబ్ది కు ఒప్పందం కుదిరిందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్నాం అని అన్నారు.

రాష్ట్రం మొత్తంలో అత్యధిక కాంగ్రెస్ సర్పంచులు నిజామాబాద్ జిల్లాలో గెలుపొందారని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ఫిరాయింపుల అంశం స్పీకర్ ఫరీదిలో ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించటం ఏమీ లేదన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్నారని అన్నారు.

టెక్నికల్ గా పార్టీ మారలేదు అని చెప్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదాసీనతవాళ్లనే నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే జీఓ లు పారదర్శకంగా ఉన్నాయన్నారు. 90 శాతం జీఓ లు అన్ని పబ్లిక్ డిమైన్ లో పెట్టామన్నారు పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క జీవో కూడా బహిర్గతం చేయలేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్దనేరం అని, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చాలా పెద్ద నేరానికి పాల్పడిందన్నారు. నేరం ఎవరు చెప్పినా శిక్ష తప్పదని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ సభ్యులు గడుగు గంగాధర్, సీనియర్ నాయకులు రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు

Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >