| Daily భారత్
Logo




కెఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

News

Posted on 2026-01-08 20:56:53

Share: Share


కెఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి:కెఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA), కామారెడ్డి సహకారంతో ఆర్‌కే డిగ్రీ & పీజీ కళాశాల, కామారెడ్డిలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత మరియు పౌర బాధ్యతలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి టి. నాగరాణి మరియు జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్  పాల్గొని ట్రాఫిక్ నియమాల పాటనతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఆర్‌కే గ్రూప్ సీఈఓ డా. జైపాల్ రెడ్డి, డీటీఓ కృష్ణ తేజ గారు, దీన్ నవీన్ మరియు ఆర్‌కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ రోడ్డు భద్రత, ట్రాఫిక్ ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు వివరించారు.

కెఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఖలీలుల్లా , ట్రస్ట్ కోఆర్డినేటర్ నేహా, ట్రస్ట్ సిబ్బంది మరియు కళాశాల అధ్యాపకులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >