Posted on 2026-01-08 21:02:08
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పాల్పడిన ఒక ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) సక్రమ్ తెలిపారు. వృద్ధుడైన సెక్యూరిటీ గార్డును భయపెట్టి, తీవ్రంగా కొట్టి అతడి వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నట్లు ఆయన వివరించారు.ఈ నెల 6వ తేదీన బాలానగర్, గౌతమ్ నగర్‌కు చెందిన రచ్చన్న (60) అనే సెక్యూరిటీ గార్డు, మంగళవారం ఉదయం నర్సాపూర్ చౌరస్తా నుంచి సనత్ నగర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఈ సమయంలో, సోమల మల్లికార్జున్ అనే ఆటో డ్రైవర్ అతడిని తన ఆటోలో ఎక్కించుకున్నాడు.బాలానగర్ పరిధిలోని వరుణ్ మోటార్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లగానే, నిందితుడైన ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటోను ఆపాడు. రచ్చన్నను భయభ్రాంతులకు గురిచేసి, అతడి వద్ద ఉన్న రూ. 300 నగదు, సెల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నాడు. అడ్డుకోబోయిన రచ్చన్నను అత్యంత క్రూరంగా కొట్టడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.దీంతో బాధితుడు రచ్చన్న బాలానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఆటో డ్రైవర్ సోమల మల్లికార్జున్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు డీఐ సక్రమ్ తెలిపారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >