Posted on 2026-01-13 23:08:27
హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం
జనవరి 18న ఖమ్మం లో జరిగే సిపిఐ శతాబ్ది సభ జయప్రదానికై వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జనవరి 18న 5 లక్షల మందితో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా కదలి రావాలని జూలూరుపాడు మండల కేంద్రంలో బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమం నుండి నేటి వరకు ప్రజల కోసం ఉద్యమించిన ఏకైక పార్టీ సిపిఐ 100 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకోవడం గర్వకారణమని ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా ఈ ప్రాంతం నుంచి కదలి రావాలని పిలుపునిచ్చారు దేశంలో ఫాసిస్టు BJP పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు భారతదేశంలో విభజించి పాలించే బిజెపిని ఓడించాలన్నారు కమ్యూనిస్టులు ఎక్కడున్నారు అనే వారికి ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా ఈ పాలకులు కు బుద్ధి చెబుతామన్నారు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సిపిఐ ప్రతినిధులు వేలాదిగా తరలివస్తున్న ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలన్నారు ఎర్ర చొక్కాలు ఎర్ర చీరలు ధరించి హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం పేరుతో వేలాదిగా కదలి వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఎల్లంకి మధు గుడిమెట్ల సీతయ్య, కిలారి నరేష్, నరసింహారావు , వెంకటేష్ సురేష్ AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >