Posted on 2026-01-18 19:30:05
డైలీ భారత్, సూర్యాపేట: అరైవ్ - అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటయ్య వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం ప్రమాదకరమని, నేరమని తెలిపారు. జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం మత్తు వల్ల ఎదుటివారి కూడా ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని సూచించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసు సూచనలను పాటించాలని అన్నారు. ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో నిత్యం మద్యం మత్తు తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >