Posted on 2026-01-20 05:28:25
ఐక్యమత్యంతో ఉండి పేద పెరిక కులస్తులను ఆర్థికంగా ఆదుకోండి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో పెరిక సంఘం ప్రారంభించినప్పటి నుండి తనకు ఎనలేని అనుబంధం ఉందని తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగేందుకు అదృష్టంగా భావిస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. సోమవారం నగరంలోని యేoడల టవర్స్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన పెరిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిక సంఘంతో తనకు మూడు తరాల తో నాకు సంబంధం ఉందని ఆయన అన్నారు. తన చిన్నప్పటినుండి ఇక్కడ పెరిక సంఘం ఒక చిన్న గదిలో సంఘo అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహించే వారని తన సిడిపి నిధులతో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భవనం అత్యంత సుందరంగా నిర్మించడం జరిగిందని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. నగరంలోని అన్ని కుల సంఘాల కంటే పెరిక సంఘం కుల భవనం ఎంతో గొప్పగా నిర్మించారని వారిని అభినందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఐక్యమత్యంతో ఉండి మీలో మీకు ఉన్న విభేదాలు వీడి అన్నదమ్ముల్లా ఉండి మీలో ఉన్న పేద కులస్తులను ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని వారిని కోరారు. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అది లోపిస్తే సంఘ అభివృద్ధి అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మీరు ఐక్యమత్యంతో ఉంటే రాజకీయ నాయకుల దగ్గరికి మీరు వెళ్లాల్సిన అక్కర్లేదని, తమలాంటి ఆయా రాజకీయ పార్టీ నేతలు మీ దగ్గరికి వచ్చి మీ బాగోగులు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఆయన తేల్చి చెప్పారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >