| Daily భారత్
Logo




నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

News

Posted on 2026-01-20 05:29:34

Share: Share


నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన పలు డివిజన్ల కు చెందిన కాలనీవాసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి లక్ష్యంగా తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుండి  తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చొరవ చూపిస్తూ డివిజన్ కు కోటి రూపాయల చొప్పున రోడ్లు డ్రైనేజీ ఇతర అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి యు ఎఫ్ ఐ డి సి పథకం ద్వారా నగరంలోని 19 డివిజన్ పరిధిలోని రోడ్ నెంబర్ 5 లో భూమి పూజ నిర్వహించినట్లు ఆయన అన్నారు. అదేవిధంగా 20 డివిజన్ ఎల్లమ్మ గుట్ట, 36వ డివిజన్ నాందేవ్ వాడ, 34 వ డివిజన్ మిర్చి కాంపౌండ్, 49వ డివిజన్ శ్రీదేవి టాకీస్ రోడ్డు, 50 డివిజన్ పరిధిలోని గురుద్వార్ దగ్గర, 27వ డివిజన్ పరిధిలోని వర్ని చౌరస్తా ప్రాంతాల్లో, 8 వ డివిజన్ పరిధిలోని బంగారు మైసమ్మ గుడి సాయి నగర్ రోడ్ నెంబర్ 2, 3, 46వ డివిజన్ ప్రాంతాల్లో భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నగర అభివృద్ధి లక్ష్యంగా తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన రోడ్లు, నాణ్యమైన డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్ల ఏర్పాటుకు ఈ ప్రత్యేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో  అర్బన్ నియోజకవర్గాన్ని దేశంలోనే కాకుండా రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ డిఇ మరియు ఇంచార్జ్ మున్సిపల్ నగేష్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎఈ లు శివకృష్, శంకర్  పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >