Posted on 2026-01-20 05:31:37
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ వారాహి దేవి ఆలయం కు రాజా శ్యామల దేవి నవరాత్రుల శుభ సందర్భంగా కృష్ణశిల స్టోన్ రావడం వల్ల భక్తుల్లో ఆనందోత్సాహాలను కలిగించింది.
సోమవారం అత్యంత శుభకరమైన రోజున అనుకోకుండా కృష్ణశిల స్టోన్ ఆలయానికి చేరుకోవడం విశేషంగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 120 టన్నుల కృష్ణశిల స్టోన్ ఆలయానికి చేరుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇది రెండో విడత కాగా, ఇంకా సుమారు 300 టన్నుల వరకు స్టోన్ రావాల్సి ఉందని తెలిపారు. ఈ కృష్ణశిల స్టోన్ రాకతో ఆలయానికి సంబంధించిన గర్భగుడి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రతి శుక్రవారం ఆలయ ప్రాంగణంలో తాత్కాలికంగా చిన్న గుడి ఏర్పాటు చేసి, అందులో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆలయం ప్రతిరోజూ భక్తుల దర్శనానికి తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అభిషేకం చేయించుకోవాలని కోరుకునే భక్తులు ఆలయంలోని అయ్యవారిని సంప్రదించాలని ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మహేష్ ఆచార్యులు, దీకొండ అశోక్, మంచాల జ్ఞానేందర్, సుదర్శన్, జయరాం సపతి, సంజీవ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్స్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ శ్రీ వారాహి దేవాలయం భవిష్యత్తులో ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >