Posted on 2026-01-20 10:31:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుజాతనగర్ సెంటర్ లో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన Arrive Alive ప్రోగ్రామ్ లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను( Black Spots) R & B AE, AMVI మానస, సుజాతనగర్ స్టేషన్ సిబ్బంది తో విసిట్ చేసి గుర్తించడం జరిగింది. అందులో సుజాతనగర్ పరిధిలో సుజాతనగర్ సెంటర్, Opposite గ్రోమోర్, వేపలగడ్డ రైల్వే బ్రిడ్జ్, డేగలమడుగు గ్రామ మలుపు, సుజాతనాగర్ పత్తి మార్కెట్ ఎదురుగా గల రోడ్ , మొదలగు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించాల్సిన భాద్యత ప్రజలందరి మీద ఉంది. ఒక కుటుంబం లో ఒక వ్యక్తి మరణించడం అంటే అతను మన మధ్యనుండి వెళ్లిపోవడం కాదు ఒక కుటుంబం రోడ్డు మీద పడడం. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి అందరి సగటు వయసు ఎక్కువగా 15 నుండి 40 లోపు వారే ఉన్నారు. దీనికి ప్రాథమిక కారణాలు హెల్మెట్ లేకపోవడం, అతి వేగం, మద్యం సేవించడం వంటివి ఉన్నాయి. పోలీస్ వారు వెహికల్ చెకింగ్ చేసి ఫైన్స్ విధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీస్ వారు పట్టుకున్న చాలా మంది వాహనదారులు మమ్మల్ని తిట్టుకుంటారు కానీ వారు జాగ్రత్తగా గమ్యం చేరడం కోసం వారికి ఒక హేచ్చరికలాగా ఉండాలని మేము చెకింగ్ చేస్తాము. అంతే కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశ్యం కాదు.దయచేసి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు వ్యక్తి గతంగా భాద్యత వహించాలని అక్కడ విచ్చేసిన ప్రజలతో ప్రమాణం కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >