| Daily భారత్
Logo




పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

News

Posted on 2026-01-23 17:00:20

Share: Share


పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ కంటేశ్వర్ లో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ,  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఐజి మల్టీజోన్ వన్ చంద్రశేఖర్, సిపి సాయి చైతన్య లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ  మాట్లాడుతూ ​ప్రజలకు చేరువగా పోలీసింగ్ వ్యవస్థ ఉందని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అమోఘమని, ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకే అత్యాధునిక వసతులతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు శాఖ ఆధునీకరణకు కట్టుబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. ​బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారికి భరోసా ఇచ్చేలా సిబ్బంది ప్రవర్తించాలని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని, శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు.​ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అవసరమని, కంటేశ్వర్ ప్రాంత ప్రజలకు ఈ రూరల్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు.​నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనం అందుబాటులోకి రావడంపై ఎమ్మెల్యే భూపతిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని, ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు పోలీసులు మరింత కృషి చేయాలని ఆయన కోరారు. ​రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి  మాట్లాడుతూ ​మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ​నేర రహిత సమాజం సిసి కెమెరాల నిఘా క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ పెంచడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. నూతన భవనాల్లో సిబ్బందికి మెరుగైన పని వాతావరణం లభిస్తుందని, ఇది వారి పనితీరును మెరుగుపరుస్తుందని అన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ విషయంలో ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు. ​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సిపి ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >