| Daily భారత్
Logo




నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

News

Posted on 2026-01-23 17:01:41

Share: Share


నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

నిజామాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది

ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పట్టణంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించారు. ​ముఖ్యంగా 58వ డివిజన్ పరిధిలోని జామా మసీద్ ప్రాంతంలో సుమారు 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సి.సి. రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణంలోని పలు డివిజన్ లలో రెండున్నర కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ​శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగర రూపురేఖలను మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని పేర్కొన్నారు. 45 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులను నాణ్యతతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ధనం ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూస్తామన్నారు. నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మరియు పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు.​కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. నిజామాబాద్ ప్రజల అవసరాలను గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని ఆయన అన్నారు. ​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు మరియు మున్సిపల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >