| Daily భారత్
Logo




మేరు సంఘం జిల్లా, నగర, అనుబంధ సంస్థల నూతన సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2026-01-23 17:02:41

Share: Share


మేరు సంఘం జిల్లా, నగర, అనుబంధ సంస్థల నూతన సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మేరు సంఘం నిజామాబాద్ జిల్లా, నగర, అనుబంధ సంస్థల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిజామాబాద్ నగరంలోని మేరు సంఘంలో శుక్రవారం  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై నూతనంగా ఎన్నికైన జిల్లా, నగర, అనుబంధ సంస్థల కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, మేరు సంఘం సామాజిక సేవ, ఐక్యత మరియు అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. సంఘాలు ప్రజల మధ్య సమన్వయం పెంచుతూ, యువతను నాయకత్వం వైపు ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో సంఘాల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హన్మంత్ రావు, నగర అధ్యక్షులు వెన్ను దేవానంద్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, నూతన కార్యవర్గ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం భవిష్యత్తులో మరింత బలోపేతమై, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా, నగర మరియు అనుబంధ సంస్థల నాయకులు, ఆలయ కమిటీ, టైలర్ కమిటీ సభ్యులు,సీనియర్ సభ్యులు, యువజన విభాగ ప్రతినిధులు, నాయకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >
Image 1

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Posted On 2026-05-02 22:26:17

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >