Posted on 2026-01-28 17:54:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి వుండాలని జనరల్ అబ్జర్వర్ మయంక్ మిత్తల్ అన్నారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జనరల్ అబ్జర్వర్ మయంక్ మిత్తల్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ లతో కలిసి నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ, ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన పనులు ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు పూర్తి చేయాలన్నారు. అన్ని సెషన్లకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందిని గుర్తించి, శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విధులు కేటాయించిన నోడల్ అధికారులు విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ క్షేత్రస్థాయి నుంచి పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధులలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా, తమకు కేటాయించిన విధులను ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా నిర్వర్తించాలని సూచించారు. నోడల్ అధికారులందరు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, డిపిఓ సురేష్ మోహన్, పిడి మెప్మా వెంకట నారాయణ, సీపీఓ సౌమ్య, బీసీ వెల్ఫేర్ అధికారి కేషు రామ్, సోషల్ వెల్ఫేర్ అధికారి రామరావు, మైనార్టీ వెల్ఫేర్ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, పిడి హౌసింగ్ చాంప్లా నాయక్, పరిశ్రమల శాఖ అధికారి శ్రీలక్ష్మి, మత్స శాఖ అధికారి పూర్ణిమ, సివిల్ సప్లయ్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్, ఆడిట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >