| Daily భారత్
Logo




డ్రోన్ నిఘా తో బహిరంగ మద్యపానానికి చెక్ : నలుగురు వ్యక్తుల అరెస్ట్

News

Posted on 2026-01-28 20:42:20

Share: Share


డ్రోన్ నిఘా తో బహిరంగ మద్యపానానికి చెక్ : నలుగురు వ్యక్తుల అరెస్ట్

డైలీ భారత్,​ అనకాపల్లి : జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నాతవరం, డి.యర్రవరం మరియు జిల్లేడిపూడి పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రోన్ నిఘా నిర్వహించారు.

నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నాతవరం ఎస్సై వై.తారకేశ్వరరావు మరియు సిబ్బంది కలిసి డి.యర్రవరం శివారు ప్రాంతాలలో డ్రోన్ సాయంతో తనిఖీలు చేపట్టారు.

బహిరంగంగా మద్యపానం చేస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచాలని జిల్లా ఎస్పీ గారు అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులను  ఆదేశించారు. బహిరంగ మద్యపానం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం డ్రోన్ల ద్వారా నిఘా ఉంచాలని, ప్రతిరోజూ వీటిని వినియోగించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


#anakapallidistrict

#anakapallipolice

#AndhraPradeshStatePolice

#Andhra Pradesh Police

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >