| Daily భారత్
Logo




అమర్ రహే.... అమర్ రహే... గాజుల సౌమ్య అమర్ రహే

News

Posted on 2026-02-02 19:45:17

Share: Share


అమర్ రహే.... అమర్ రహే... గాజుల సౌమ్య అమర్ రహే

టీఎన్జీవో కొవ్వొత్తుల ర్యాలీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత నెల 23 న గంజాయి స్మగ్లర్ల అమానుష దాడిలో  తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ... తుది శ్వాస వదిలిన, ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య కి

 సంతాప సూచకంగా టీఎన్జీవో ఆధ్వర్యంలో... ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ల అధ్యక్షతన, సోమవారం టిఎన్జీవో జిల్లా కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా,కోర్టు చౌరస్తా మీదుగా... నగరంలోని ప్రధాన కూడలీల గుండా అమర్ రహే... గాజుల సౌమ్యజి.. అమర్ రహే ....అంటూ నినాదాలు చేస్తూ,... కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు

అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్  మాట్లాడుతూ... ధీరవనిత కుమారి గాజుల సౌమ్య  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ,...టీఎన్జీవో సంఘం వారి కుటుంబానికి అండగా ఉంటుందని, దాడికి పాల్పడిన దోషులను చట్టరీత్యా వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అతీక్అహ్మద్, కె.పి  సునీత, మంజుల, జాఫర్ హుస్సేన్, మాణిక్యం, పురుషోత్తం,అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, వివిధ యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జ్ఞానేశ్వర్, సృజన్ కుమార్ ,సూర్య ప్రకాష్, విశాల్, నాగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, క్లాస్ ఫోర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, అన్ని శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై, ఆ వీరవనితకు ఘనంగా నివాళులు అర్పించారు

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >