| Daily భారత్
Logo




పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

News

Posted on 2026-02-02 19:46:31

Share: Share


పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులను ఒక క్రమ పద్దతిలో అమర్చుకోవాలని అన్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.వర్టికల్స్ వారీగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు,సిబ్బంది పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని  అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాద నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అనంతరం అక్కడ విధులలో ఉన్న సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్,ఎస్సై శ్రీనివాస్,టీజీఎస్పీ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >