Posted on 2026-02-02 19:48:19
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న కాకర్ల , సూరారం , గురువాగు తండా , వెంగన్నపాలెం , అన్నారుపాడు , సాయిరాం తండా గ్రామాలకు చెందిన మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ , సిలిండర్లను జూలూరుపాడు మండల బీజేపీ అధ్యక్షుడు భూక్యా రమేష్ గారు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతకోసం , వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం , కట్టెల పొయ్యి నుంచి మహిళలను విముక్తి పరచడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల యోజన పథకాన్నీ ప్రారంభించడం జరిగిందని మరియు మహిళల అభ్యున్నతి కోసం దేశ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలనుప్రవేశపెడుతున్నారు అని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామారావు, ఉపాధ్యక్షుడు బాలకిషన్,యువ మోర్చా అధ్యక్షుడు రాంబాబు , గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి , కార్యదర్శి బాబూలాల్ , సోషల్ మీడియా కన్వీనర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >