Posted on 2026-02-04 17:09:55
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ ఎన్నికల ఖర్చులపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఎన్నికల ఖర్చుల అవగాహన కార్యక్రమం సి నా రే కళా మందిరం లో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఎన్నికల నియమావళి, ఖర్చుల పరిమితి, ఖర్చుల వివరాల నమోదు విధానం, డే టు డే అకౌంట్ నిర్వహణ, షాడో రిజిస్టర్ నిర్వహణ, బ్యాంక్ అకౌంట్ వినియోగం వంటి అంశాలపై అభ్యర్థులకు వివరంగా అవగాహన కల్పించారు.
అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తూ, భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. అనుమతి లేని ఖర్చులు చేయరాదని, చేసిన ప్రతి ఖర్చుకు సంబంధించిన బిల్లులు, వౌచర్లు తప్పనిసరిగా భద్రపరచాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా అభ్యర్థుల్లో ఎన్నికల ఖర్చులపై స్పష్టత ఏర్పడి, స్వచ్ఛమైన, న్యాయమైన మరియు పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఇది దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ , రిటర్నింగ్ ఆఫీసర్లు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >