Posted on 2026-02-06 17:42:26
కార్పొరేషన్ అభివృద్ధికి సిపిఐనే దిక్సూచి
అహంకారులకు కార్పొరేషన్ ఎన్నికలు గుణపాఠం కావాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కూనంనేని రోడ్ షోలు, ప్రచార సభలకు అపూర్వ స్పందన
డైలీ భారత్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో నిర్వహించిన భారీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కొత్తగూడెం అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్రచిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా సీపీఐ ఎల్లప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు. బస్తీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల నుంచి సంక్షేమ ఫలాల పంపినీవరకు వరకు ప్రతి అంశంపై తాము పోరాడుతామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఎర్రజెండా అభ్యర్థుల విజయం అనివార్యమని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేశానని, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టేందుకు ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేయిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, నిబద్ధత గల సిపిఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా అహంకారులకు తగినరీతిలో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని, సామాన్యుడి ముంగిటకు సంక్షేమ ఫలాలు చేరడం, కార్పొరేషన్ సమగ్రంగా అభివృద్ధి సాధించడమే నిజమైన విజయమని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమాల్లో జిల్లా నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్ కె ఫహీమ్, అభ్యర్థులు మూడ్ గణేష్, సహేరా మహమ్మద్, బోయిన విజయ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సల్మా, కొచ్చెర్ల రాకేష్ కాంత్, ఇమ్రాన్ మహమ్మద్, బేత అనంతలక్ష్మి, నాయకులు యూసుఫ్, తుమ్మ నర్సయ్య, పల్నాటి ప్రశాంత్, అస్మత్, జడల ప్రకాష్, అజీజ్, జక్కుల రాములు, కుమారి హన్మంతరావు తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >