Posted on 2026-02-17 23:44:45
మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన
డైలీ భారత్, కోనరావుపేట: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >