| Daily భారత్
Logo




"కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

News

Posted on 2026-02-19 14:09:39

Share: Share


"కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్

డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు రాజీవినగర్ లోని చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ గ్రూప్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినారు.

ఈ సందర్భంగా పున్నంచందర్ మాటాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో కార్మికులు తమ పనిలో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందనీ ప్రముఖ సైకాలజిస్ట్ కె . పున్నచందర్ తెలిపారు.

శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, అనారోగ్యకరపు  ఆహార అలవాట్లు మరియు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కార్మికుల్లో ఏర్పడుతున్నాయనీ అన్నారు. 

కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు.

శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా సమానంగా ముఖ్యమని  అన్నారు.

నిరంతర ఒత్తిడి, ఆర్థిక భారం, కుటుంబ బాధ్యతలు వంటివి మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందనీ  తెలిపారు.

అలసట, నిద్రలేమి, చిరాకు, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే నిపుణులను సంప్రదించాలి.

కార్మికులు పాటించాల్సిన ముఖ్య సూచనలు చేశారు.

సమతుల్య ఆహారం తీసుకోవడం రోజూ కనీసం 7–8 గంటల నిద్ర మద్యపానం, పొగ త్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం నిరంతర వైద్య పరీక్షలు చేయించుకోవడం యోగా, ధ్యానం వంటి పద్ధతులతో మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలని అన్నారు.

పని సమయంలో భద్రతా నియమాలు పాటించడం

యజమానులు కూడా తమ సంస్థల్లో ఆరోగ్య శిబిరాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించి కార్మికుల శారీరక–మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహకరించాలనీ అన్నారు.

ఆరోగ్యవంతమైన కార్మికులు ఉంటేనే కుటుంబం, సంస్థ మరియు సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందనీ తెలుపుతూ

 “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నినాదాన్ని గుర్తుంచుకుని ప్రతి కార్మికుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ అన్నారు.

కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయ మాట్లాడుతూ..

 ప్రభుత్వం అందిస్తున్న థ్రిఫ్ట్ పథకం, నేతన్న బీమా, ప్రధానమంత్రి జీవిత సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి లాంటి పథకాల్లో చేరి వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయ, హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మేషం రాజయ్య, రవీందర్ కార్మికులు పాల్గొన్నారు.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >