Posted on 2026-02-19 22:30:38
శంషాబాద్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసిన డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలోని గ్రేటర్ శంషాబాద్ జోన్ పరిధిలో రాళ్లగూడ రోడ్డులో నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్దం చేసిన ఏబీవీ రీలైఫ్ హాస్పిటల్ వివాదంలో చిక్కుకుంది. నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌తో డాక్టర్‌గా చలామణి అవుతున్న ఆనంద్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్న డాక్టర్స్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో (టిజిఎంసి) కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆనంద్ కుమార్ చిట్‌పల్లి అనే వ్యక్తి డాక్టర్ పేరుతో చలామణీ కావడమే కాకుండా గతంలో షాద్ నగర్‌లో హాస్పిటల్ తెరిచి వైద్యం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.అక్కడ వైద్యుల ఫిర్యాదుతో ఆనంద్ కుమార్ పైన కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు. ఇప్పుడు శంషాబాద్‌లోనీ రాళ్లగూడ రోడ్డులో ఏబీబీ రీ లైఫ్ పేరుతో హాస్పిటల్‌ను ప్రారంభించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎలాంటి మెడికల్ డిగ్రీ సర్టిఫికెట్ లేకపోయినా డాక్టర్ పేరు పెట్టుకుని ప్రజలను, అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నాడని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని.. అందువల్ల ఆయన ఎలాంటి వైద్య సేవలు కొనసాగించకుండా తగు చర్యలు తీసుకోవాలని డీసీపీకి సూచించారు.ఆయనపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ అమరేందర్, శంషాబాద్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ట్రెజరర్ ఐఎంఏ సంతోష్ కుమార్, వేణుగోపాల్ శివకాంత్ శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. డాక్టర్ అమరేందర్ మాట్లాడుతూ... ఐఎంఏ శంషాబాద్ నుంచి తన పేరు వాడుకున్నాడని, తాను ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎలాంటి డిగ్రీ లేనటువంటి వారికి ప్రోత్సాహం చేయడం సరైంది కాదని ఆయన చెప్పారు. పూర్తి విచారణ చేసి నిజా నిజాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శంషాబాద్ డీసీపీ రాజేష్‌కి ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >