Posted on 2026-02-20 09:55:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమన్నారు.పోలీస్ జాగిలం షైనీ కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లాల్ సింగ్,లైకా కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న కే.ముత్తయ్య,ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు,సిబ్బందికి ఈ సందర్బంగా ఎస్పీ పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 12 పోలీస్ జాగిలాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాగిలాల సంరక్షణ,వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >