Posted on 2026-02-20 12:01:32
నర్సంపేట /నల్లబెల్లి డైలీ భారత్: నల్లబెల్లి మండల కేంద్రంలోని పురుగుమందుల వాడకంపై ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట సీనియర్ సేల్స్ ఆఫీసర్ నాన్న బోయిన ఓదెలు మాట్లాడుతూ పంట పొలాల్లో రైతులు పురుగుమందులను వాడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తూ రైతులు పురుగుమందులు ఆహార పదార్థాలతో కలిపి రవాణా చేయకూడదు. పిల్లలకు దూరంగా భద్రపరచవలెను. గాలి వీచే దిశగా పిచికారి చేయవలెను. పిచికారి చేసే సమయంలో ఆహార పదార్థాలు దూరంగా ఉంచవలెను. పిచికారి చేసిన పొలంలో హెచ్చరిక బోర్డులను నాటాలి. పురుగుమందుల డబ్బాలను ఏ విధమైన అవసరాలకు వాడకూడదు అని వివరించారు ఈ కార్యక్రమంలో నర్సంపేట సీనియర్ సేల్స్ ఆఫీసర్ ఓదేలు, శివకుమార్, జన్ను బిక్షపతి మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >