Posted on 2026-02-20 10:39:15
డైలీ భారత్, మంగళగిరి: పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. టీవీ సౌండ్ తగ్గించమన్న విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది.
పోలీసుల సమాచారం ప్రకారం, పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసిస్తున్నారు.
క్రాంతికి గతంలోనే వివాహం కాగా, ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.
గురువారం రాత్రి ఇంట్లో టీవీ సౌండ్ తగ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో క్రాంతి కత్తితో అహ్మద్‌ను పొడిచినట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్రాంతిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >