Posted on 2023-09-17 13:14:45
డైలీ భారత్: ఈరోజు స్థానిక శివనగర్ బాయ్స్ హై స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరపున రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికై అవార్డు పొందిన కొత్వాల్ ప్రవీణ్ ని ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ మాట్లాడుతూ కొత్వాల్ ప్రవీణ్ తను పనిచేసే వీర్నపల్లి మండలం రంగంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకు విద్య అందించే వారని అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పండగల రోజును కూడా విభిన్నంగా పాఠశాలలో పిల్లలతో జరిపించేవాడు. అలాగే పాఠశాలలో కలర్స్ డే,మట్టి వినాయకుల తయారీ, రాఖీల తయారి పిల్లలచే చేపించేవాడు సైన్స్ ఫెయిర్ లో మరియు టిఎల్ఎం మేళాలో మండల జిల్లా స్థాయి బహుమతులను కూడా గెలుచుకున్నారు అని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గుండమనేని మహేందర్ రావు మాట్లాడుతూ అన్ని విధాలుగా అర్హుడని ప్రవీణ్ కి ఈ అవార్డు రావడం సరియైనదని పిల్లలకు నాణ్యమైన విద్య బోధించడంలో ముందుంటారని అలాగే ఇలాంటి ఎన్నో అవార్డు రావాలని కోరుకున్నారు.
TSUTF జిల్లా కార్యదర్శి గా పనిచేస్తున్న ప్రవీణ్ కు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జిల్లా ఉపాధ్యాయులకు గర్వకారణం.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం పరకాల రవీందర్ ఆడేపు శివ, పాముల స్వామి గౌడ్, వంగ మల్లేశం, నరేష్ పాల్గొన్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >