| Daily భారత్
Logo




ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

News

Posted on 2026-03-03 06:54:11

Share: Share


ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

డైలీ భారత్, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓతల్లి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌ మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్, ఐశ్వర్య దంపతులు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లల సంతానం.అయితే కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఐశ్వర్య, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి అత్తారింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య చంపేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ముగ్గురు మృతిచెండంతో గొల్లగూడె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి

Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >