Posted on 2026-03-03 17:01:53
అధికారులు, సిబ్బందితో కలిసి ఆనందాన్ని పంచుకున్న జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హోలీ పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, ఒకరికొకరు రంగులు పూసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిరంతరం విధి నిర్వహణలో బిజీగా ఉండే సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపేలా ఎస్పీ స్వయంగా వారితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం ఈ వేడుకల్లో విశేషం.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐక్యత మరియు కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. వృత్తిరీత్యా ఎంతో ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీసు కుటుంబంలో ఇటువంటి వేడుకలు సభ్యుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత పటిష్టం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపిఎస్, పిసిఆర్ సిఐ నరేష్, కామారెడ్డి టౌన్ ఎస్.హెచ్.ఓ నరహరి, సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఆర్.ఐ లు నవీన్ కుమార్, కృష్ణ మరియు జిల్లాలోని ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు.
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >