| Daily భారత్
Logo




రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

News

Posted on 2026-03-04 11:20:03

Share: Share


రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలల సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకుంది.

సన్న బియ్యం నిల్వల సామర్థ్యంపై ఆందోళన:

దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి మూడు నెలలకు సరిపడ కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిలువలు, సాధ్యాసాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది.

సమస్యలు:

ఒకేసారి మూడు నెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా మూడు నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండటంతోపాటు.. డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశముంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు సమస్యగా మారింది. ఇక మూడు నెలలకు సంబంధించి మూడు ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర (థంబ్) వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వస్ సమస్యలతో ఒక్కో కార్డుకు దాదాపు 15-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది.

Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >