| Daily భారత్
Logo




కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

News

Posted on 2026-03-07 18:14:07

Share: Share


కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా బంజారా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మొహమ్మద్, కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచారని, ఆయన బోధనలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

బంజారా సమాజం సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం, తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్య మరియు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

అదేవిధంగా బంజారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం బంజారా మహోత్సవాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బంజారా సంఘ నాయకులు, బంజారా సోదరులు, సోదరీమణులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >