| Daily భారత్
Logo




సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు

News

Posted on 2026-03-07 21:22:31

Share: Share


సద్గురు సేవాలాల్ మహారాజ్ బోగ్ బండరో కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలo నియోజకవర్గం భద్రాచలం ఎమ్మెల్యే  తెల్లం వెంకట్రావ్,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహరాజ్ నిర్వాహణ కమిటీ భూక్యా రంగా అధ్యక్షతన అధికారికంగా జరిగిన సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భోగ్ భండారో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,టిజిటిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, జి ఎల్ ఎస్ జేఏసీ చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ బాల బ్రహ్మచారి ,శివ అవతారి కలియుగంలో పుట్టిన యుగ పురుషుడని  అన్నారు.

యావత్ భారత దేశంలో సుమారు 15 కోట్ల బంజారా జాతి బిడ్డలు ఆరాధించే ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు.

సేవాలాల్ మహరాజ్ తండలో ఏర్పాటు చేసిన నాయక్,కార్బారీ వ్యవస్థనే ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారే చెప్పుకొచ్చారని,రాజ్యాంగం రాసే సమయంలో తండా నాయక్, కార్భారి వ్యవస్థను పరిశీలించే  ప్రజాస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చారని చెప్పారు.మద్దిమడుగుతో పాటు రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో 10 ఎకరాల విస్తీర్ణంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ గుడి నిర్మాణం చేపట్టాలని కోరారు.

లంబాడీ జనాబా అత్యధికం ఉన్న జిల్లా కేంద్రాలలో సుమారు 5 ఎకరాలలో గుడి నిర్మాణం చేపట్టాలని కోరారు.

రాష్ట్ర సచివాలయం ముందు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని,కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందు కూడా విగ్రహ ఏర్పాటు చేసేలా పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరారు.

15 కోట్ల మంది మాట్లాడే గోర్ బోలి భాషను కేంద్ర ప్రభుత్వం 8 వ షెడ్యూల్ లో చేర్చాలని కోరారు.షెడ్యూల్ ఏరియా ప్రాంత గిరిజనుల కోసం జిఓ 3 స్థానంలో ప్రత్యక జిఓ ను తెచ్చేలా అసెంబ్లీ తీర్మానo చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం జడ్జి శివ నాయక్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి గన్యా నాయక్,DD అశోక్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ధర్మ గురు పూజారి బానోత్ భోజ్యా నాయక్,తేజావత్ మోహన్ లాల్,బాదావత్ గోవింద్,GLS JAC సెక్రటరీ జనరల్ రమేష్ నాయక్,వైస్ చైర్మన్ లావుడ్య  ప్రసాద్,మోహన్, సైదులు,ప్రతాప్ సింగ్,రాంచందర్, రామకృష్ణ,కౌశిక్ నాయక్,రంజిత్,బిచ్చ నాయక్, రామదాస్, బన్సీలాల్,సీతారాం,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >