| Daily భారత్
Logo




బుల్ బార్‌లపై కేంద్రం నిషేధం - మీ కారుకు ఉంటే వెంటనే తీసేయండి,లేదంటే ఫైన్ తప్పదు

News

Posted on 2026-03-10 17:49:22

Share: Share


బుల్ బార్‌లపై కేంద్రం నిషేధం - మీ కారుకు ఉంటే వెంటనే తీసేయండి,లేదంటే ఫైన్ తప్పదు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారత్‌లో చాలా మంది వాహనదారులు తమ కారును మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు లేదా అదనపు రక్షణ కోసం కొన్ని యాక్సెసరీలను అమర్చుకుంటారు.వాటిలో ముఖ్యంగా కనిపించేది బంపర్ గార్డ్. దీనిని సాధారణంగా బుల్ బార్ లేదా క్రాష్ గార్డ్ అని కూడా పిలుస్తారు.ఈ మెటల్ బార్‌లను సాధారణంగా కారు ముందు లేదా వెనుక బంపర్‌పై అమరుస్తారు.ముఖ్యంగా ఎస్ యువి లు లేదా పెద్ద కార్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి కారుకు రక్షణ కల్పిస్తాయని చాలా మంది భావిస్తారు.కానీ,ఇందులో పూర్తిగా వాస్తవం లేదు. నిజానికి, మన దేశంలో ఈ బుల్ బార్‌లు/బంపర్‌ గార్డ్‌లను వాడటం చట్టవిరుద్ధం అనే విషయం చాలా మందికి తెలియదు.

2017లోనే కేంద్రం నిషేధం

వాహన భద్రతను దృష్టిలో ఉంచుకుని, రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 2017లో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కార్లకు బుల్ బార్‌లు లేదా బంపర్ గార్డ్‌లను నిషేధించింది.కార్లకు మాత్రమే కాదు,ఈ నిబంధన దాదాపు అన్ని రకాల వాహనాలకు వర్తిస్తుంది.ముఖ్యంగా ఎస్ యువి లు,జీపులు లేదా ఇతర కార్లకు అదనంగా అమర్చే మెటల్ గార్డ్‌లు వాహన భద్రత ప్రమాణాలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.

ఎయిర్‌బ్యాగ్‌లపై ప్రభావం

బంపర్ గార్డ్‌లు కారుకు అదనపు రక్షణ ఇస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ భద్రత నిపుణుల ప్రకారం ఇవి ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ పనితీరును దెబ్బతీసే అవకాశం ఉంది.

సాధారణంగా కారు ఢీకొన్నప్పుడు వాహనంలోని సెన్సార్‌లు ప్రభావాన్ని గుర్తించి వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లను తెరుస్తాయి.కానీ ముందు భాగంలో బుల్ బార్ లేదా బంపర్ గార్డ్‌ ఉండటం వల్ల ఆ ప్రభావం సెన్సార్‌లకు సరైన విధంగా చేరకపోవచ్చు.

దీని కారణంగా,కొన్ని సందర్భాల్లో ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి పని చేయకపోవచ్చు. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.

పాదచారులకు కూడా ప్రమాదం

బుల్ బార్‌ లేదా బంపర్ గార్డ్‌ కేవలం కారులో ఉన్నవారికే కాకుండా పాదచారులకు కూడా ప్రమాదకరం.ఈ మెటల్ బార్‌లు చాలా దృఢంగా ఉండటం వల్ల ప్రమాద సమయంలో గాయాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా,ప్రమాద సమయంలో పాదచారులపై ప్రభావాన్ని కొంత వరకు తగ్గించేలా కార్ల బంపర్‌లను రూపొందిస్తారు.కానీ బుల్ బార్‌లు ఉండటం వల్ల ఆ రక్షణ తగ్గిపోతుంది. రోడ్డుపై నడిచే వ్యక్తులకు తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఎంత జరిమానా పడుతుంది?

కారుకు బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ అమర్చడం మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం నేరం. సెక్షన్ 190 & 191 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ట్రాఫిక్ పోలీసులు తనిఖీల సమయంలో వాహనంలో బుల్ బార్ కనిపిస్తే రూ.1000 నుంచి రూ.5000 వరకు జరిమానా విధించవచ్చు.

అదేవిధంగా,రోడ్లపై బుల్ బార్‌తో వాహనం నడుపుతున్నట్లు గుర్తిస్తే, అక్కడికక్కడే వాటిని తొలగించే అధికారం కూడా ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది.

వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం

చాలా మంది స్టైల్ కోసం లేదా కారుకు రక్షణ కోసం బుల్ బార్‌లను అమర్చుకుంటున్నారు. కానీ ఇవి చట్టపరంగా నిషేధితమైనవే కాకుండా భద్రత పరంగా కూడా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.అందుకే మీ కారులో బుల్ బార్ లేదా బంపర్ గార్డ్ ఉంటే వెంటనే తొలగించడం మంచిది. లేకపోతే ట్రాఫిక్ పోలీసులు తనిఖీ సమయంలో జరిమానా తప్పకపోవచ్చు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >