Posted on 2026-03-11 18:48:15
మహిళలు ప్రతిరంగంలో ముందుండాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
డైలీ భారత్, కామారెడ్డిజిల్లా వయోవృద్ధుల, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు స్వతంత్రంగా అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి సమాజంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలు విద్య, ఉద్యోగం, ఉపాధి, క్రీడలు తదితర అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, దేశ స్థాయిలో విద్య, ఉద్యోగం, ఉపాధి, క్రీడా రంగాల్లో, స్వచ్ఛంద సంస్థల కు చెందిన ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. ఐడీఓసీలోని వివిధ విభాగాలకు చెందిన మహిళల కోసం ఆటలు, పాటలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మొత్తం 150 మంది మహిళలను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శాలువాలు, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. సోనియా శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యమై పెద మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చిన సోనియా శంకరును అభినందించారు. ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపకను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిచ్కుంద మున్సిపల్ చైర్‌పర్సన్ సీమా సెట్‌కార్, వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, అడిషనల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మి, డీపీఆర్‌ఓ తిరుమల, సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, జిల్లా మహిళా సాధికారత కేంద్ర సిబ్బంది శారద, తులసి, సౌందర్య, అరుణ్ కుమార్, బాల రక్షాభవన్ అధికారి స్రవంతి, చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ సిబ్బంది, సఖి కేంద్రం సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >