Posted on 2026-03-11 20:19:53
బాధితురాలికి అండగా నిలిచిన దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నరసింహసాగర్ కు చెందిన దంసలపూడి పద్మ అనే మహిళను తన కొడుకు నాగరాజు ఆస్తి కోసం కొడుతూ తిడుతూ ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బందులు తట్టుకోలేక ఆ మహిళ దిశ ప్రొటెక్షన్ టౌన్ అధ్యక్షురాలు అరుణ ను ఆశ్రయించింది. దిశ ప్రొటెక్షన్ ఫౌండేషన్ చైర్మన్ బీవీ రాజు, ఉపాధ్యక్షులు కళ్యాణి, జిల్లా అధ్యక్షురాలు పూజల లక్ష్మీ, జిల్లా జనరల్ సెక్రెటరీ పిట్టల కమలమ్మ సూచనతో టౌన్ అధ్యక్షురాలు బొల్లం అరుణ ఆధ్వర్యంలో బాధిత మహిళ దంసలపూడి పద్మతో మాట్లాడిన సభ్యులు ఆమె సమస్యను తెలుసుకుని సుజాతనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్సై రమాదేవి ని కలిసి పద్మ న్యాయం జరిగేలా చూడాలని మాట్లాడి బాధితురాలు కొడుకుపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మండల ప్రెసిడెంట్ దేవరపల్లి రజిని, జగన్నాధపురం మండల ప్రెసిడెంట్ గడ్డం జ్యోతి, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మందకృష్ణ వేణి, దిశా సభ్యురాలు బిందు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >