| Daily భారత్
Logo




విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

News

Posted on 2026-03-11 20:27:35

Share: Share


విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ భిక్నూర్‌లో ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం

ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు 

కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: విశ్వవిద్యాలయ ప్రాంగణం కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రం కాదు, అది ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, సమాజానికి ఒక గొప్ప నాయకుడిని అందించే అద్భుతమైన వేదిక. ఇక్కడ వికసించే ఆలోచనలు మీ భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించేలా ఉండాలి తప్ప, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలను చీకట్లోకి నెట్టేయకూడదు" అని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆకాంక్షించారు. ఈరోజు భిక్నూర్‌లోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం మరియు క్రమశిక్షణపై నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి సమావేశంలో కామారెడ్డి ఏఎస్పి బి చైతన్య రెడ్డి పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు

ఈ సందర్భంగా ASP చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలలో ఏర్పడే స్నేహాలు జీవితాంతం నిలిచిపోయే తీపి జ్ఞాపకాలని, అటువంటి పవిత్రమైన బంధాలను గౌరవించుకోవాలని సూచించారు. సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లకు అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లలా అండగా నిలబడి మార్గదర్శకులుగా మారాలని కోరారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను వమ్ము చేయవద్దని ఆమె విద్యార్థులను సున్నితంగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా భిక్నూర్ CI సంపత్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ విద్యార్థి జీవితం ఎంతో అందమైన దశ అని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో కష్టపడుతూ వారిని చదివిస్తారని పేర్కొన్నారు. అలాంటి జీవితాన్ని అనవసరమైన విషయాల వల్ల ఇబ్బందుల్లో పడేయకూడదని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే విధంగా విద్యార్థులు తమ ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

అలాగే భిక్నూర్ SI ఆంజనేయులు ర్యాగింగ్ వల్ల కలిగే పరిణామాలు, చట్టపరమైన శిక్షలు మరియు దాని ప్రభావాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశలో పోలీస్ కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్, వివిధ విభాగాల అధ్యాపకులు, సీనియర్ మరియు జూనియర్ విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >