Posted on 2026-03-11 22:05:47
అంతర్ జిల్లా దొంగతనాల ముఠా గుట్టురట్టు
ఇద్దరు నిందితుల అరెస్ట్ డిమాండ్ కు తరలింపు
వెండి ఆభరణాలు, నగదు, వాహనాలు స్వాధీనం
కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించుతున్నట్లు నటిస్తూ గ్రామాల్లో తిరిగి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను భిక్నూర్ పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్ పర్యవేక్షణలో భిక్నూర్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
భిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 06-03-2026 న రామేశ్వరపల్లి గ్రామంలో ఒక ఇంటి తలుపులు పగులగొట్టి రెండు జతల వెండి పట్టా గొలుసులు మరియు రూ.10,000 నగదు దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే 08-03-2026 న భిక్నూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తాళం పగులగొట్టి హుండీలోని సుమారు రూ.1,000 నగదు దొంగిలించిన ఘటనపై మరో కేసు నమోదు చేశారు.
ఈ రెండు కేసులపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, బిక్నూర్ ప్రాంతంలోని BTS వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న లంబాడీ శ్రావణి (21) అనే మహిళను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో ఆమె తన భర్త శ్రీనివాస్ తో కలిసి పై రెండు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకుంది.
సంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రావణి మరియు ఆమె భర్త శ్రీనివాస్ దొంగతనాన్ని ఒక వృత్తిగా మార్చుకున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటున్నట్లు తిరుగుతూ ఏ ఇల్లు తాళం వేసి ఉందో గమనించి (రెక్కీ), క్షణాల్లో తాళాలు పగులగొట్టి దోచుకోవడం వీరి శైలి. గత ఫిబ్రవరిలో ముదిమానిక్ గ్రామంలో వీరు దొంగిలించిన 4 తులాల బంగారాన్ని నర్సాపూర్కు చెందిన స్క్రాప్ వ్యాపారి పర్థం ఏలియాకు అమ్మగా వచ్చిన రూ.1.70 లక్షలతో విలాసాల కోసం పల్సర్ NS200 బైకు కొనుగోలు చేశారు. దొంగిలించిన సొత్తుతో జల్సాలు చేస్తూ పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది
దొంగిలించిన వెండి ఆభరణాలను నర్సాపూర్కు చెందిన స్కాప్ వ్యాపారి పర్థం ఏలియా @ ప్రవీణ్ (26) కు అమ్మినట్లు తెలిపింది. దీంతో అతనిని కూడా అదుపులోకి తీసుకొని కేసులో నిందితుడిగా చేర్చారు.
నిందితుల వివరాలు:
A1: లంబాడీ శ్రావణి, A2: శ్రీనివాస్ (ప్రతుత్తం పరారిలో వున్నాడు A3: పర్ధం ఏలియా @ ప్రవీణ్
1. రెండు జతల వెండి పట్టిగొలుసులు
2.రూ.2,000 నగదు
3. Samsung కీప్యాడ్ మొబైల్ ఫోన్
4. 1000 మొబైల్ ఫోన్
5. హోండా షైన్ మోటార్ సైకిల్
6. పల్సర్ NS 200 బైక్ నిందితుల వద్ద నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ కేసును త్వరితగతిన చేదించిన భిక్నూర్ సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు మరియు పోలీస్ సిబ్బందిని కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి అభినందించారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >