| Daily భారత్
Logo




తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

News

Posted on 2026-03-16 16:59:16

Share: Share


తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..

డైలీ భారత్, హైదరాబాద్: ఎండల తీవ్రత పెరిగింది. అదే సమయంలో తీవ్ర ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తెలంగాణలో వచ్చే ఆరు రోజుల పాటు అంటే.. మార్చి 16 నుంచి 21వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో మొదలై మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాలకు ఈ భారీ వర్షాలు విస్తరిస్తాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. దాంతో మార్చి 21వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుతుందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని వివరించింది. అందువల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమలతోపాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది..

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >