| Daily భారత్
Logo




రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు

News

Posted on 2026-03-20 21:55:27

Share: Share


రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు

డైలీ భారత్, కామారెడ్డి: రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను అకస్మాత్తుగా సందర్శించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడి అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

రేపు జరగబోయే రంజాన్ పండుగను పురస్కరించుకుని మసీదులు, ప్రార్థనా స్థలాలు మరియు ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి పహారా బలపరిచే చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

అనంతరం సదాశినగర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన రోల్ కాల్‌లో పాల్గొన్న ఎస్పీ , పోలీస్ సిబ్బందికి పండుగ సందర్భంగా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో “డయల్ 100” సేవలను వినియోగించాలని తెలిపారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >