| Daily భారత్
Logo




జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

News

Posted on 2026-03-26 19:10:11

Share: Share


జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

నస్రుల్లాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జూద స్థావరంపై మెరుపు దాడి

ఏడుగురు పట్టివేత

జిల్లాలో అక్రమ పేకాట స్థావరాలపై నిఘా కొనసాగుతోంది చట్టపరమైన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్.,

డైలీ భారత్, కామారెడ్డి:జూదం అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు, అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి. క్షణికానందం కోసం జూదానికి బానిసలైతే, అది అప్పుల ఊబిలోకి నెట్టి, చివరికి ఆత్మహత్యల వంటి దారుణమైన పరిణామాలకు దారితీస్తుంది. ప్రజలు, ముఖ్యంగా యువత ఇటువంటి అక్రమ మార్గాలకు దూరంగా ఉండి, బాధ్యతాయుతమైన పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు" అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్. స్పష్టం చేశారు.

నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్రుల్లాబాద్ గ్రామంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు, ఎస్సై పి. రాఘవేంద్ర ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 9,280 నగదుతో పాటు, ఏడు మొబైల్ ఫోన్లు మరియు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి సమాచారం అందించాలని పోలీస్ శాఖ కోరుతోంది. అక్రమ కార్యకలాపాల గురించి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డైల్ 100 కు ఫోన్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-18 20:47:25

Readmore >
Image 1

స్కూళ్ల మూసివేత నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలి

Posted On 2026-06-18 20:45:05

Readmore >
Image 1

ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం

Posted On 2026-06-18 20:43:25

Readmore >
Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >